తక్కువ ధర బియ్యం విక్రయాల ప్రారంభం

సఖినేటిపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తక్కువ ధర బియ్యం విక్రయాల కార్యక్రమాన్ని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎమ్మెల్యే, బియ్యం విక్రయాలు పారదర్శకంగా, సక్రమంగా జరిగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.