
చిక్కబళ్లాపూర్ (కర్ణాటక): జనసేన పార్టీ సిద్ధాంతాలు, సామాజిక పరివర్తనకు సంబంధించిన భావజాలాన్ని కర్ణాటకలోని ప్రజలకు, ముఖ్యంగా యువతకు చేరవేసే లక్ష్యంతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
చిక్కబళ్లాపూర్ జిల్లా చింతామణి నియోజకవర్గంలో జనసేన పార్టీ సాదక్, అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం చింతామణి నియోజకవర్గ అధ్యక్షుడు దేవరాజ్ ఆధ్వర్యంలో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు చేపట్టారు.
జనసేన భావజాలాన్ని విస్తృత స్థాయిలో ప్రజలకు చేరవేసేందుకు ఇటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.