మృతుడి కుటుంబానికి జనసేన అండ.. దినకార్యానికి బియ్యం ప్యాకెట్ల పంపిణీ

ఎచ్చెర్ల నియోజకవర్గం: రణస్థలం మండలం, కోటపాలెం పంచాయతీకి చెందిన కాకర ఆదినారాయణ (అంజిబాబు) ఇటీవల మృతి చెందడం కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన జనసేన నాయకులు, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

అంజిబాబు దినకార్యాల సందర్భంగా కుటుంబానికి అవసరమైన బియ్యం ప్యాకెట్లను అందజేసి తమ వంతు సహకారం అందించారు. ప్రాణాలను తిరిగి తీసుకురాలేకపోయినా, బాధిత కుటుంబానికి అన్ని విధాలా తోడుగా నిలుస్తామని జనసేన నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గొర్ల సూర్య, అల్లివలస జనసేన నాయకులు రవికుమార్, అప్పన్న, గౌరి వినయ్, సత్య, ఈశ్వర్, ఎర్రయ, గణతో పాటు పలువురు జనసైనికులు పాల్గొని అంజిబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి అవసరమైన సమయంలో అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.