
పార్వతీపురం: వి.ఆర్.పురం మండల కేంద్రం రేఖపల్లి గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణానికి బుధవారం ఘనంగా శ్రీకారం చుట్టారు. వీరమహిళ బాగుల ప్రమీళారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ములకాల సాయికృష్ణ మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు, ప్రజలకు మరింత చేరువగా ఉండేందుకు ఈ కార్యాలయం ఉపయోగపడుతుందన్నారు. ప్రజా సమస్యలను నేరుగా వినేందుకు, నాయకులను సులభంగా కలిసేందుకు, పార్టీ సమావేశాలు, ఎన్నికల ప్రణాళికలు, వ్యూహాల రూపకల్పనతో పాటు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యాలయం శాశ్వత చిరునామాగా నిలుస్తుందని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 2న జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథుల సమక్షంలో పార్టీ కార్యాలయాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యాలయం మండలంలో పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందని, పార్టీ బలోపేతానికి కీలక కేంద్రంగా మారుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బాగుల అంజనరావు, కెచ్చల పోసిరెడ్డి, యూత్ ప్రెసిడెంట్ పెడపెట్ల పవన్ కళ్యాణ్, గూటాల సమ్మరాజు, మండల సహాయ కార్యదర్శులు మాచర్ల వేణుబాబు, ముంజపు శ్రీరామ్, సీనియర్ నాయకులు మాదిరెడ్డి బోసు తదితరులు పాల్గొని కార్యాలయ నిర్మాణానికి శుభాకాంక్షలు తెలిపారు.