
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముంబయిలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న నేపథ్యంలో, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ అనంతపురంలోని శ్రీ కైలాసనాథ దేవాలయంలో ప్రత్యేక రుద్రాభిషేకం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి బోయ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంకె ఈశ్వరయ్య, ఆయన సతీమణి శశిరేఖ దంపతులు పరమేశ్వరుడికి రుద్రాభిషేకం నిర్వహించి పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా అంకె ఈశ్వరయ్య మాట్లాడుతూ, పరమశివుని కృపతో పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు.