అమెజాన్ ప్రైమ్ డే సేల్‌కు ముహూర్తం ఖరారు

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వార్షిక ‘ప్రైమ్ డే 2026’ సేల్ తేదీలను ప్రకటించింది. భారత్‌లో ఈ మెగా సేల్ జులై 4 అర్ధరాత్రి నుంచి ప్రారంభమై జులై 6 వరకు మొత్తం 72 గంటల పాటు కొనసాగనుంది. ప్రైమ్ సభ్యుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు అందించనున్నారు.

స్మార్ట్‌ఫోన్ల విభాగంలో శాంసంగ్, వన్‌ప్లస్, రెడ్‌మీ, ఐకూ, రియల్‌మీ వంటి ప్రముఖ బ్రాండ్లపై ఆకర్షణీయమైన ధరలు అందుబాటులో ఉంటాయి. ల్యాప్‌టాప్‌లపై కూడా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించగా, శాంసంగ్, ఎల్‌జీ, సోనీ, టీసీఎల్ వంటి బ్రాండ్ల స్మార్ట్ టీవీలపై గరిష్ఠంగా 75 శాతం వరకు డిస్కౌంట్లు లభించనున్నాయి.

ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లు చేసే వారికి 10 శాతం వరకు తక్షణ తగ్గింపు, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ ప్రయోజనం కల్పించనున్నారు. ఎంపిక చేసిన ఉత్పత్తులపై నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.

భారత్‌లో ప్రైమ్ సేవలకు పదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రైమ్ సభ్యత్వ రుసుములను కూడా తగ్గించింది. వార్షిక సభ్యత్వంతో పాటు ఇతర ప్రైమ్ ప్లాన్‌లపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన అమెజాన్, ఈ సేల్‌లో 500కు పైగా కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.