అరకు పార్లమెంట్‌లో జనసేన సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

అరకు: జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా అరకు పార్లమెంట్ పరిధిలో నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది.

అరకు పార్లమెంట్ పరిశీలకులు శ్రీ నాగబాబు నేతృత్వంలోని 28 మంది సభ్యుల బృందం అరకు గుడ్ మార్నింగ్ రిసార్ట్స్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

పార్టీ కమిటీల్లో వివిధ బాధ్యతలు చేపట్టి జనసేన పార్టీ కోసం పనిచేయడానికి ఆసక్తి ఉన్న నాయకులు, జనసైనికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, దరఖాస్తుదారుల వివరాలను సేకరించి పరిశీలించిన అనంతరం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి సమర్పిస్తామని తెలిపారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసే నాయకత్వాన్ని గుర్తించి సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

పార్టీ బాధ్యతలు చేపట్టాలనే ఆసక్తి ఉన్న నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై తమ దరఖాస్తులను సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.