అరకు పార్లమెంట్ అబ్జర్వర్ టీమ్‌లో బలిజే కోటేశ్వరరావు పడాల్‌కు స్థానం

హుకుంపేట: జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటిలో భాగంగా ఎమ్మెల్సీ శ్రీ కొణిదెల నాగబాబు సారథ్యంలో ఏర్పాటైన అరకు పార్లమెంట్ అబ్జర్వర్ టీమ్‌కు హుకుంపేట మండల అధ్యక్షుడు, ఏఎంసీ డైరెక్టర్ బలిజే కోటేశ్వరరావు పడాల్ ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా హుకుంపేట మండల జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీలో నిజాయితీ, నిబద్ధతతో పనిచేసిన నాయకత్వాన్ని గుర్తించి ఈ కీలక బాధ్యతలను అప్పగించడం సంతోషకరమైన పరిణామమని పేర్కొన్నారు.

అరకు పార్లమెంట్ పరిధిలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ, కార్యకర్తలతో సమన్వయం, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బలిజే కోటేశ్వరరావు పడాల్ సమర్థవంతంగా పనిచేస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టి ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ, ఈ అవకాశాన్ని కల్పించిన జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్‌కు హుకుంపేట మండల జనసేన శ్రేణులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాయి.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.