
నరసాపురం కో-ఆపరేటివ్ అర్బన్ సొసైటీ (బ్యాంక్) లిమిటెడ్ నూతన చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వలవల రవికుమార్ (నాని)తో పాటు పాలకవర్గ సభ్యులు సమతం వీరకోట నాగ వెంకటేశ్వరరావు, మాధుం కనక శ్రీనివాస్, మహమ్మద్ సలీమ్, అప్పన నాగ వెంకట, వనమ రాజ్‌కుమార్, తిరుమాని శ్రీరామరాజు, రావూరి వెంకట సత్యనారాయణ, పాలూరి విఘ్నేశ్వర వరప్రసాద్, తుమ్మలపల్లి లక్ష్మీనారాయణ, కొరాడ వెంకట పాపారావు, కడిమి ప్రవీణ్‌కుమార్, నాట్ర నరేష్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ, నరసాపురం కో-ఆపరేటివ్ అర్బన్ సొసైటీ ప్రజలకు మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడంతో పాటు సభ్యుల సంక్షేమం, సంస్థ అభివృద్ధికి నూతన పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు చైర్మన్, డైరెక్టర్లు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, టీడీపీ ఇన్‌చార్జ్ పొత్తూరి రామరాజు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొప్పాడ రవీంద్రనాథ్ ఠాగూర్, జిల్లా మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షుడు మైల వసంతరావు, జనసేన నాయకులు వర్ధనపు ప్రసాద్, జిల్లా డెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ గుబ్బల మార్రాజు, నిప్పులేటి తారక రామారావు, దేశినీడి గంగాధర్, పోలిశెట్టి శ్రీనివాస్, వాతాడి కనకరాజు, ఆకన చంద్రశేఖర్, కొల్లాటి గోపీకృష్ణ, గుబ్బల నాగరాజు, దొండపాటి స్వాములు, గంటా కృష్ణ తదితరులు పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు బ్యాంకు సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.