
రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు మండలం సింగారెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కంబాలకుంట హరిజనవాడకు చెందిన గానుగపెంట నరసయ్య కుటుంబం ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇంట్లోని సామగ్రి పూర్తిగా దగ్ధమవడంతో కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి తక్షణ ఉపశమనంగా రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ, అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితి ఎంతో బాధాకరమని అన్నారు. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడం జనసేన పార్టీ సిద్ధాంతమని, భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ కుటుంబానికి తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.
అలాగే అగ్నిమాపక శాఖ సిబ్బంది, రెవెన్యూ అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందాల్సిన సహాయం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. బాధిత కుటుంబం తిరిగి సాధారణ జీవనం సాగించే వరకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, పగలడాల చంద్రశేఖర్, మండల సీనియర్ నాయకుడు యర్రంశెట్టి హరిబాబు రాయల్, యువ నాయకులు గొబ్బూరు హరి, కొడిదల సాయి, కోనేటి శివయ్య (సచిన్), గుత్తి మోహన్, కేత నరసింహ, మొలకల సాయి, గొబ్బూరు రామచంద్ర, గురుగుంట్ల సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు