తోట కళ్యాణ్ జన్మదిన వేడుకలు.. చిత్తూరు బస్టాండ్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన శిబిరం

మదనపల్లె జనసేన పార్టీ యువ నాయకుడు తోట కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు బస్టాండ్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర పాల్గొని తోట కళ్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అడపా సురేంద్ర మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఆవిర్భావానికి ముందునుంచే తోట కళ్యాణ్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. ఎలాంటి పదవులు ఆశించకుండా, పార్టీ బలోపేతమే తన ఎదుగుదలగా భావిస్తూ నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తున్న నాయకుడని కొనియాడారు.

పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తూ, ఎప్పటికప్పుడు కొత్త నాయకులను తయారు చేస్తూ జనసేన పార్టీకి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. యువతలో పార్టీ భావజాలాన్ని తీసుకెళ్తూ, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ అవుతున్నారని తెలిపారు.

ఈ రక్తదాన శిబిరంలో నిమ్మలపల్లి జనసేన మండల అధ్యక్షుడు సోలంకి ప్రదీప్ సింగ్‌తో పాటు అఫ్రోజ్ ఖాన్, తానేశ్వర్, నరేంద్ర, రాంమోహన్, అజయ్, గిరి, సురేష్, విజయ్, హరి, అభిషేక్, జై శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.