చిరంజీవికి క్లాప్‌ కొట్టిన పవన్‌.. మెగా 158 గ్రాండ్ ఓపెనింగ్!

చిరంజీవి కొత్త సినిమా పూజా కార్యక్రమంలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఒకే ఫ్రేమ్‌లో నవ్వుతూ, ముచ్చటిస్తూ కనిపించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ అపురూప దృశ్యం మెగా ఫ్యాన్స్‌కు ప్రత్యేక ఆనందాన్ని కలిగించింది.

మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మెగా 158’ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, ప్రియమణి, అనస్వర రాజన్, అనురాగ్ కశ్యప్, బండ్ల గణేశ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సందర్భంగా ముహూర్తపు షాట్‌కు పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. మెగా బ్రదర్స్ ముగ్గురూ ఒకే వేదికపై కనిపించి ముచ్చటించడంతో ఆ హ్యాపీ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.