
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నాయకులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అర్జీలను ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి) చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు స్వీకరించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న అనంతరం సంబంధిత జిల్లాల అధికారులతో చర్చించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ నిరంతరం అందుబాటులో ఉంటుందని, ప్రతి అర్జీపై తగిన ప్రాధాన్యం ఇస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధుసూదన్ రావు, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు అంబటి తిరుపతిరావు, తాడేపల్లి మండల కార్యదర్శి చాముండేశ్వరి దేవి, లీగల్ సెల్ ప్రతినిధి కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.