
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అసన్‌సోల్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పశ్చిమ బర్ధమాన్ జిల్లా బస్తీన్ బజార్ ప్రాంతంలో సంవత్సరాలుగా మూతపడ్డ దుర్గామాత ఆలయం మళ్లీ తెరుచుకుంది.
ఇంతవరకు కేవలం పండుగల సమయంలో మాత్రమే తెరుచుకునే ఈ ఆలయాన్ని ఇకపై ఏడాది పొడవునా భక్తుల దర్శనార్థం అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. దీంతో స్థానిక భక్తుల దీర్ఘకాల కోరిక నెరవేరింది.
అసన్‌సోల్ నార్త్ నియోజకవర్గం నుంచి గెలిచిన బీజేపీ నేత కృష్ణేందు ముఖర్జీ తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో బీజేపీ విజయంతో ఈ మార్పు సాధ్యమైందని స్థానికులు భావిస్తున్నారు.
ఎన్నికల అనంతరం కృష్ణేందు ముఖర్జీ స్వయంగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ద్వారాలను భక్తుల కోసం శాశ్వతంగా తెరిచారు.
గతంలో కేవలం దుర్గా పూజ, లక్ష్మీ పూజల సమయంలో మాత్రమే దర్శనం లభించగా, ఇప్పుడు నిత్యం అందుబాటులో రావడంతో భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.