వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చటం ఆదర్శనీయం:

  1. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
  2. పులిగడ్డలో ఎంవీ కృష్ణారావు శత జయంతి సందర్భంగా చలివేంద్రం ప్రారంభం

అవనిగడ్డ: వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చటం ఆదర్శనీయం అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డ మండలం పులిగడ్డలో దివిసీమగాంధీ, మానవతావాది, మాజీ మంత్రి వర్యులు స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శతజయంతి ఉత్సవాలు సందర్భంగా వారి జ్ఞాపకార్ధం ప్రయాణికులు, బాటసారుల కోసం మండలి అభిమానులు నూతన చలివేంద్రం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చలివేంద్రం ప్రారంభించి, తొలిరోజు సందర్భంగా పానకం పంపిణీ చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల వైపు యువత ఆసక్తి చూపటం స్ఫూర్తిదాయకం అన్నారు.

మండలి రామకోటి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లంకమ్మ దేవస్థానం చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గాజుల శంకర రావు, పార్టీ సీనియర్ నాయకులు బచ్చు వెంకటనాథ ప్రసాద్, టీడీపీ క్లస్టర్ ఇంచార్జి బండే రాఘవ, మోపిదేవి మండల జనసేన అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్, దేవస్థానం డైరెక్టర్ కోసూరు అవినాష్, సీనియర్ నేత మండలి రామ్మోహనరావు, నాయకులు భోగాది రాధాకృష్ణ, చెన్ను బాబురావు, అద్దంకి మాధవరావు, నాగిడి రాంబాబు, చెన్ను నాగేంద్రరావు, మండలి శేషగిరిరావు, చెన్ను రాంబాబు, మండలి నాగేశ్వరావు, గుంటూరు పెదబాబు, వర్రే శివాజీ, మేరుగు రవీంద్రబాబు, మండలి వెంకటేశ్వరరావు, మండలి సోమ సుందరరావు, చెన్ను శివాజీ, మండలి సత్యనారాయణ, గుంటూరు వినయ్ బాబు, మండలి భావన్నారాయణ, మిట్ట రమేష్, మండలి సురేష్, పడమటి సాంబశివరావు, బడుగు వెంకటేశ్వరరావు, నాగిడి సుబ్రమణ్యం, భోగాది నాగమల్లేశ్వరావు, జంగం గ్యాబిరెల్, పారేపల్లి అంకాలరావు, ఆరిగ బసవయ్య, పూషడపు మనోహర్, మండలి శ్రీ బలరాం, దుట్టా గోపీచంద్, మండలి శివప్రసాద్, అర్జా శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.