పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు విస్తృత పర్యటన

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కుమార్‌పురంలోని గోకులం గ్రాండ్ వద్ద కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అధ్యక్షతన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, వార్డు ఇంచార్జ్‌లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలోనే ముందంజలో పిఠాపురం నియోజకవర్గంలో కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతి గ్రామంలో రోడ్లు, ప్రతి ఇంటికి అభివృద్ధి పథకాలు కూటమి ప్రభుత్వంలో నిరంతరం అందుతున్నాయని పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో పవన్ కళ్యాణ్ కృషి విశేషమని ఆయన అన్నారు. అలాగే పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రతి వార్డు స్థాయిలో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని దిశానిర్దేశం చేశారు.

జనసేన పార్టీ లక్ష్యం ప్రజా సేవేనని, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నాగబాబు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పిఠాపురం ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు పెండెం దొరబాబు, ఓదురి కిషోర్, మార్కెట్ కమిటీ చైర్మన్ వాకాపల్లి దేవి సూర్యప్రకాష్, మండల ఇంచార్జ్ వెన్న జగదీష్, డా. వరలక్ష్మి, గొల్లప్రోలు మండల ఇంచార్జ్ జ్యోతుల శ్రీనివాస్, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు చల్ల లక్ష్మి, పెంకే జగదీష్, సూరిశెట్టి జయకృష్ణ, దానం లాజర్ బాబు, మొగలి అప్పారావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.