నాదెండ్ల భాస్కరరావు మృతికి నివాళులర్పించిన అడపా సురేంద్ర

మదనపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల మదనపల్లిలోని అమ్మ చెరువు మిట్ట భయ్యా రెడ్డి కాలనీలో సంతాప కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు.

జనసేన నాయకురాలు, జాతీయ బీసీ సంఘం కార్యదర్శి చామంతుల మల్లిక ఆధ్వర్యంలో ఈ సంతాప సభ నిర్వహించబడింది. నాదెండ్ల భాస్కరరావు రాజకీయ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గిరి, రమేష్, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.