శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలపై నేమూరి శంకర్ గౌడ్ ఫైర్

హైదరాబాద్: మంగళగిరిలో రామచంద్ర యాదవ్ నిర్వహించిన సభలో తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై జనసేన తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పూర్తిగా ఖండనీయమని పేర్కొన్నారు.

శ్రీనివాస్ యాదవ్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చిన రామచంద్ర యాదవ్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ అని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా బీసీలకు 100కు పైగా సీట్లు కేటాయించడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని తెలిపారు.

తనను బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించి తెలంగాణ జనసేన రాష్ట్ర ఇంచార్జిగా నియమించినది కూడా పవన్ కళ్యాణ్ేనని అన్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హత లేకుండా కులం కార్డు ఉపయోగించడం తగదని విమర్శించారు.

మైక్ దొరికిందని ఎవరైనా అనవసర వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరిస్తూ, ప్రజా నాయకులు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.