
తిరుపతి: మే 5వ నుంచి 13 వరకు తిరుపతి తాతయ్యగుంట గంగ జాతర ఆహ్వాన పత్రిక, కరపత్రం, గోడ పత్రికలను ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆవిష్కరించారు. మే 5వ తేది రాత్రి చాటింపుతో తాతయ్యగుంట గంగ జాతర ప్రారంభమై మే 13వ తేది తెల్లవారుజామున విశ్వరూప దర్శనంతో ముగుస్తాయని ఆయన వెల్లడించారు.
మే 12వ తేది అంగరంగ వైభవంగా గంగ జాతర జరుగుతుందని ఆయన తెలిపారు. గంగజాతర పనులను ఆలయ పాలకమండలి ఛైర్మన్ మహేష్ యాదవ్, పాలకమండలి సభ్యులు నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తిరుపతితో పాటు చుట్టు పక్కల గ్రామాలతో పాటు రాయలసీమ వ్యాప్తంగా అమ్మవారి ఆశ్శిశ్శుల కోసం జాతర సమయంలో భారీగా భక్తులు వస్తారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అమ్మవారి దర్శన భాగ్యం కల్పనలో సామాన్య భక్తులకే పెద్దపీఠవేస్తామన్నారు.
గంగజాతర ఏర్పాట్లను తాతయ్య గుంట గంగమ్మ ఆలయ పాలకమండలి చైర్మన్ మహేష్ యాదవ్, పాలకమండలి సభ్యులు ఏర్పాట్లు నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. జాతర సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని పోనున్నట్లు ఆయన తెలిపారు. గంగజాతరను రాజకీయాలకు అతీతంగా నిర్వహించనున్నట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్ మహేష్ యాదవ్ తెలిపారు. రాయలసీమతోపాటు తమిళనాడు, కర్నాటక నుంచి జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. జాతర పనులను పాలకమండలి సమిష్టిగా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో టిడిపి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, బిజెపి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ లు, శ్యాప్ ఛైర్మన్ రవి నాయుడు, యాదవ కార్పోరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి, జేబి శ్రీనివాస్, పులుగోరు మురళీ, జనసేన నగర అధ్యక్షులు రాజా రెడ్డి, సుమన్ బాబు, మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణా, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వాసు, మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ వి ఎం శ్రీధర్, కంకణాల రజనీకాంత్, జలపోతు చంద్ర, ఆముదాల వెంకటేష్, జానకీరామ్ రెడ్డి, ఆళ్వార్ మురళీ, కీర్తన, సుభాషిణి, వాణిశ్రీ, రాజేష్ ఆచారి, ఆది, గోపి, సుధాకర్, శిరీష, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.