నరసరావుపేటలో శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి రంగాల విగ్రహాల ఆవిష్కరణ

నరసరావుపేట నియోజకవర్గంలో 33వ వార్డు బరంపేట ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి మోహనరంగా విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.

శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు మరియు కాపు సోదరుల ఆహ్వానం మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

అలాగే మాజీ శాసనసభ్యులు కిలారి రోశయ్య, కార్పొరేషన్ చైర్మన్లు హరిబాబు, డేగల ప్రభాకర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.