



జనసేన పార్టీలో భారీ ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా చిరంజీవి అభిమాన సంఘానికి చెందిన సభ్యులు జనసేన పార్టీలో చేరారు.
ఈ చేరికలు ఉమ్మడి నిజామాబాద్ ఇంచార్జి గుండా సంతోష్ గారి ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ గారి సమక్షంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు డి. పాండు గారు, జిల్లా నాయకులు ఈశ్వర్, నవీన్ కుమార్, వెంకట్ రెడ్డి, రవి స్వామి, నీరజ మాధవి, సంధ్య రాజేశ్వరి మరియు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు గంగం అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై యువత, అభిమానులు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని నాయకులు తెలిపారు.