




ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న మెగా కల్చరల్ ఫెస్ట్‌లో పాల్గొనేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయంలో ప్రజలతో నేరుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, వారి వినతులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్న నాయకత్వాన్ని ఆయన మరోసారి చాటిచెప్పారు.