గౌరవ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు “గ్రామ స్వరాజ్యం 2.0” లక్ష్య సాధన కోసం పలు వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
పల్లెపండుగ 2.0, ఫామ్ పాండ్స్, మ్యాజిక్ డ్రైన్స్, గోకులాలు, స్వచ్ఛ రథాలు వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ అభివృద్ధిని వేగవంతం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి కృషిని వివరించే ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, నీటి వనరుల పరిరక్షణ, పారిశుధ్యంపై దృష్టి పెట్టడం ద్వారా గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.