జెఎస్‌పి మిడ్‌వెస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నాదెండ్ల జన్మదిన వేడుకలు

అమెరికాలోని జనసేన పార్టీ (జెఎస్‌పి) మిడ్‌వెస్ట్ విభాగం, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశాన్ని వెంకట్ బద్దుల సమన్వయం చేయగా, ఎన్ఆర్ఐలు మంత్రి పరిపాలనా విజయాలు, రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సమావేశంలో చెన్నా కృష్ణ, వెంకట్ తోట, నవీన్, భారత్ తదితర ముఖ్య సభ్యులు పాల్గొని మనోహర్ నాయకత్వంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

వరి కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసి, రైతుల బ్యాంకు ఖాతాల్లో 24–48 గంటల్లో చెల్లింపులు జమ అయ్యేలా చేసినందుకు ప్రశంసించారు. పైప్డ్ నేచురల్ గ్యాస్ (పి.ఎన్.జి) కనెక్షన్ల విస్తరణలో చూపిన దూకుడు, “దీపం 2.0” ఉచిత ఎల్పీజీ సిలిండర్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ముఖ్య సంక్షేమ కార్యక్రమాలుగా పేర్కొన్నారు. చివరగా, జెఎస్‌పీ మిడ్‌వెస్ట్ సభ్యులు పార్టీ గ్రామ స్థాయి కార్యకలాపాలు మరియు కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తమ మద్దతును కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.