
ఇచ్చాపురం: దాసరి బుజ్జి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని కవిటి మండలంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఇచ్చాపురం జనసేన ఇంఛార్జ్ మరియు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి రాజు ప్రారంభించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఈ శిక్షణ కార్యక్రమం మూడో విడతగా సోమవారం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని కంప్యూటర్ నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమం 45 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. డీసీఏ, ఫండమెంటల్స్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇవ్వబడుతుంది.
శిక్షణ పూర్తి చేసిన వారికి కామ్టెక్ కంప్యూటర్స్ ద్వారా సర్టిఫికెట్ అందజేయబడుతుందని, ఈ సర్టిఫికెట్ ఎంఎన్సీ కంపెనీలు మరియు ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బేహారా, ఏఎంసి డైరెక్టర్ బడే రాజు, పి.ఏ.సి.ఎస్ డైరెక్టర్ దున్న పాపారావు, కవిటి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు అంగ సురేష్ కుమార్, ప్రోగ్రాం కమిటీ సభ్యులు దుగాన దివాకర్, జనసేన నాయకురాలు లమ్మత శైలజా, ఉపాధ్యక్షులు లోళ్ళ సాగర్, తలగాన ఈశ్వర్, నాయకులు హేమా చలపతి, చందాన జగదీష్, అట్టాడ సతీష్, శ్యామ్, శివకోటి సురేష్, లక్ష్మీనారాయణ, పైల రత్నం, విష్ణు, వంశీతో పాటు జనసైనికులు, వీరమహిళలు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.