కూటమి ప్రభుత్వ కార్యదక్షతకు నిదర్శనం అమరావతి: ఎమ్మెల్యే బొలిశెట్టి

తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ.. పార్లమెంటులో బిల్లును ఆమోదించటం కూటమి ప్రభుత్వ కార్యదక్షతకు నిదర్శనమని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు.

రాజధాని బిల్లును పార్లమెంటు ఆమోదించిన శుభ సందర్భంలో, స్థానిక పోలీస్ ఐలాండ్ కూడలిలో కూటమి ఆధ్వర్యంలో గురువారం కృతజ్ఞత సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ కూటమి ప్రభుత్వం సాధించిన ఘన విజయాన్ని ప్రతి ఇంటిలోనూ దీపం వెలిగించి జరుపుకోవాలని కోరారు.

గత వైసీపీ విధ్వంసకర పాలనలో అమరావతిని నిర్లక్ష్యం చేసి, రాష్ట్రానికి రాజధాని లేకుండా, అధోగతిని కలిగించిన విషయాలను విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మానసిక రుగ్మతతో ప్రవర్తిస్తున్నారని, వెంటనే వైద్యం చేయాల్సిన అవసరం ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఏవేవో పిచ్చిపిచ్చి పేర్లు ప్రతిపాదిస్తూ జగన్ సైకోలా ప్రవర్తించిన విషయాన్ని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లచిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేరాయని, రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్తులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం పొందే విధంగా పెద్ద ముందడుగు వేశారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు అమరావతి అత్యంత ప్రధానమని, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వానికి, జగన్ అరాచక పాలనకు తేడాను ప్రజలు గమనించాలన్నారు.

ఇప్పటికీ జగన్ లో పరివర్తన రాకపోవడం విచారకరమని, రాజధాని బిల్లు పార్లమెంటు ఆమోదం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, కూటమి పాలనకు జేజేలు పలుకుతున్నారని తెలిపారు. అమరావతి రాజధానిగా పార్లమెంట్ ఆమోదం పొందడంతో యువతకు భరోసా కలిగిందని, ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి నుంచి భవిష్యత్తుపై యువతకు భరోసా ఏర్పడినట్టు తెలిపారు. ఏ రాష్ట్రానికైనా రాజధాని ఆధారంగానే అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు.

అనంతరం, స్థానిక పెద్ద శివాలయంలో ప్రజలందరితో కలిసి దీపాలను వెలిగించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ. సుబాబు, తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ రాజరాజేశ్వరి, పెంటపాడు మండలం ఎమ్మార్వో సునీల్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ మల్లికార్జునరావు, భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, ఎంపీపీ కట్టిపోయిన వెంకటలక్ష్మి, వర్తనపల్లి కాశి, పుల్లా బాబి, అడపా ప్రసాద్, చాపల రమేష్, దువ్వ శ్రీను, సబ్జా సుబ్బు, వాడపల్లి సుబ్బరాజు, మద్దాల మణికుమార్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పైబోయిన వెంకటరామయ్య, పసలకొండ, నరిసే సోమేశ్వరరావు, అడ్డగర్ల సురేష్, భోగి రెడ్డి ఆదిలక్ష్మి, గట్టం నాని, రామ్ లక్ష్మణ్, కొవ్వూరి లక్ష్మారెడ్డి, మద్దిపాటి ధర్మేంద్ర, మలపాక చిట్టి, దాసరి కృష్ణవేణి సత్తి జగన్మోహన్, అడబాల మురళి, కట్టు బోయిన కృష్ణ ప్రసాద్, ఒట్టికూటి అబ్బు, బేటిన గిరిధర్, అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.