ఇంద్రకీలాద్రిపై వాహన పార్కింగ్ టెండర్ ప్రక్రియ

విజయవాడ: ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో భక్తుల వాహనాల పార్కింగ్ టోల్ రుసుము వసూలు కోసం 2026-27 ఆర్థిక సంవత్సరానికి టెండర్ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం మహా మండపం 6వ అంతస్తులో నిర్వహించబడింది. సీల్డ్ టెండర్ ప్రక్రియలో సి.ఎస్.ఆర్ ఎంటర్ ప్రైజెస్ 2,21,21,555/- రూపాయలకు, ఇ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్ ద్వారా అయ్యప్ప ఎంటర్ ప్రైజెస్ 2,22,29,999/- రూపాయలకు ఆఫర్ చేసారు. చివరగా బహిరంగ వేలంలో సి.ఎస్.ఆర్ ఎంటర్ ప్రైజెస్ 2,46,00,000/- రూపాయలకు హెచ్చు పాట పడి టెండర్ గెలిచింది.

గత ఆర్థిక సంవత్సరం 2025-26లో టెండర్ మొత్తం 1,74,90,000/- రూపాయలకు నిర్ణయించబడింది. 23.03.2026న జరిగిన టెండర్ 2,01,00,000/- రూపాయలకు ప్రారంభమైనప్పటికీ సరైన ధర రాలేకపోవడంతో ఆలయ ఈవో ఆ టెండర్ రద్దు చేసి మళ్లీ ప్రక్రియ జరుపాలని ఆదేశించారు.

మంగళవారం టెండర్ ప్రక్రియ ఆలయ కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు పూర్తి చేయబడింది. బహిరంగ వేలంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వీకే శీనా నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు పి. రాఘవరాజు, ఎ. శ్రీనివాసరావు, ఆలయ అధికారులు రంగారావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.