పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ఆరా తీసిన ఉపరాష్ట్రపతి

శ్రీకాకుళం: భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఇటీవల శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా పలువురు కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి పీసీని చంద్రమోహన్‌తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురపు తేజేశ్వరరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పాండ్రంకి శంకర్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పైడి శెట్టి జయంతి తదితరులు హాజరయ్యారు. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఉపరాష్ట్రపతి పర్యటన కొనసాగింది.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, జనసేన అధ్యక్షుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి పీసీని చంద్రమోహన్‌ను ఆప్యాయంగా అడిగి తెలుసుకోవడం అక్కడి నేతలకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది. ఆ క్షణాన్ని పీసీని చంద్రమోహన్ మరపురాని అనుభవంగా గుర్తు చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.