నెల్లూరు: నగరంలోని 16వ డివిజన్లో ‘అభివృద్ధి అడుగులు – సంక్షేమం వెలుగులు’ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జనసేన జిల్లా నాయకుడు కిషోర్ గునుకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా కిషోర్ గునుకుల, ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి, వీరమహిళలతో కలిసి స్థానిక ప్రముఖులను కలిసి అభివృద్ధి కరపత్రాలను పంపిణీ చేశారు. నెల్లూరు నగరంలో, ముఖ్యంగా 16వ డివిజన్లో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
అలాగే ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న కిషోర్ గునుకుల సేవలను స్థానికులకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన కోసం ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజేశారు.
ఈ సందర్భంగా 16వ డివిజన్‌కు చెందిన ప్రముఖులు కొట్టే రామ్మూర్తి, బీజేపీ నాయకులు ముక్కు రాధాకృష్ణ గౌడ్, మదు, శ్రీధర్ కుటుంబ సభ్యులను కలిసి అభివృద్ధి పనులను వివరించే కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి, జయలక్ష్మి గునుకుల, పసుపులేటి ప్రవల్లిక, మడపర్తి ప్రశాంత్ గౌడ్, కార్తీక్, చెంగయ్య తదితరులు పాల్గొన్నారు.