శ్రీకాళహస్తి నియోజకవర్గం : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన – టీడీపీ నియోజకవర్గ స్థాయి ఉమ్మడి సమన్వయ సమావేశం నిర్వహణలో భాగంగా గురువారం శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ కార్యాలయం నందు జరిగిన సమావేశంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, వీరమహిళలు, జనసైనికులతో నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా వెళ్లి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వందల మంది జనసైనికులతో కలిసి ర్యాలీ గా టీడీపీ కార్యాలయంకి వెళ్ళడం జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన – టీడీపీ ఉమ్మడి సమన్వయ సమావేశంలో జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం గొప్పగా అలోచించి జైలు గోడల వద్ద పొత్తు ప్రకటించిన జనసేనాని నిర్ణయాన్ని మనస్పూర్తిగా స్వాగతిస్తూ, అధినేత మాటే మాకు వేద వాక్కుగా భావించి రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీని గద్దె దింపి జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి భేదాబిప్రాయాలు లేకుండా పని చేసి నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీల గెలుపుకు కష్టపడి పని చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో జగన్ చేస్తున్న అరాచకాలను, నియోజకవర్గంలో ఎమ్మెల్యే బియ్యపు మదుసుదన్ రెడ్డి చేస్తున్న దోపిడీలను ఇంటింటికీ వివరించి ప్రజల్లో ప్రభుత్వం అవినీతిని ఎండగడుతామని తెలిపారు. ఉమ్మడి పార్టీల ఆదేశాల మేరకు రానున్న నెల రోజులు నియోజకవర్గంలో మినీ మానిఫెస్టోను ఇంటింటికీ టీడీపీ నాయకులతో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మండల స్థాయి నుండి, గ్రామ స్థాయి వరకు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు సమన్వయంతో ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ సమిష్టిగా పని చేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయం, నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని రాష్ట్ర ప్రజలకు అందించేలా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్, మండల అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, వీరమహిళలు, నాయకులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.