అమలాపురం ఛాంబర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

అమలాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్‌టీసీ కాంప్లెక్స్ రోడ్‌లోని బుద్ధ విహార్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఛాంబర్ అధ్యక్షుడు బోనం సత్తిబాబు ఆధ్వర్యం వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరాన్ని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కంచిపల్లి అబ్బులు, మోకా సుబ్బారావు, కొమ్మూరి చలపతి, వలవల శివరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.