రామసముద్రం : రామసముద్రం మండలంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకొన్న జనసేన కార్యకర్త బంగారప్ప కొన్ని రోజుల క్రితం చనిపోవడం జరిగింది. బుధవారం జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలు వీరమహిళలు బంగారప్ప కుటుంబాన్ని పరామర్శించి జనసేన పార్టీ యొక్క క్రియాశీలక సభ్యత్వం తీసుకొన్న జనసైనికులు ఎవరినైనా చనిపోతే వారికి 500000 ఇన్సూరెన్సు జనసేన పార్టీ తరుపున ఇవ్వడం జరుగుతుందని దానికి కావలసిన సర్టి ఫికెట్లను తీసుకొని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేకూరేలా చేస్తామని హామీ ఇచ్చారు . ఇలాంటి ఆర్థిక సాయం కేవలం ఒక జనసేన పార్టీలో మాత్రమే ఉందని అందుకు జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపతున్నా మని అన్నారు . ఈ కార్య క్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం , జిల్లా జాయింట్ సెక్రటరీ సనా ఉల్లా , మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, రామసముద్రం మండల అధ్యక్షులు చంద్రశేఖర్, రెడ్డెమ్మ, క్రాంతి బంగారం, జైరాజ్, చంద్రశేఖర, లవన్న , జనర్దన్, నవాజ్, సత్య తదితరులు పాల్గొన్నారు.