పాలకొండ నియోజకవర్గం జనసేన అభ్యర్ధిగా శ్రీ నిమ్మక జయకృష్ణను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేశారు. ఎస్టీలకు రిజర్వు చేసిన పాలకొండ నియోజకవర్గం నుంచి మిత్రపక్షాల అభ్యర్ధిగా శ్రీ జయకృష్ణ బరిలో నిలవనున్నారు. ఈ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ఆశావహులు ఎక్కువగా ఉండి పోటీపడడంతో పలు దఫాలుగా జనసేన పక్షాన సర్వే లు జరిగాయి. ఈ సర్వే లో శ్రీ జయకృష్ణకు అత్య ధికంగా ప్రజల మద్దతు లభిం చడంతో పార్టీ అధ్య క్షులు శ్రీ పవన్ కళ్యా ణ్ గారు ఆయనను అభ్యర్ ధిగా ఖరారు చేశారు.