
విజయవాడ: సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్చారిటబుల్ ట్రస్ట్ అదినేత డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో విజయవాడలోని రోటరీ క్లబ్‌లో శరీర మరియు అవయవ దానంపై అవగాహన సెమినార్ అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ సమరం మరియు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ హాజరై, శరీర అవయవ దానం ద్వారా వైద్య విద్య, పరిశోధనలకు ఎంతో మేలు జరుగుతుందని, అలాగే మరెంతో మంది ప్రాణాలను రక్షించవచ్చని వివరించారు.
ఈ సందర్భంగా తెలుగు సినీ దర్శకుడు కేశవ పాల్గొని బాడీ మరియు కంటి దానం చేయగా, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్చారిటబుల్ ట్రస్ట్ టీమ్ అధ్యక్షురాలు గూడూరు సీతామహాలక్ష్మి చేతుల మీదుగా మెమెంటో అందజేశారు.
ఈ కార్యక్రమంలో దేశభక్తి, సమాజం పట్ల గౌరవం, సాటి మనిషి పట్ల ప్రేమ కలిగిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్చారిటబుల్ ట్రస్ట్ టీమ్‌కు చెందిన భారతీ, ఇందిర, తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ తవితా తులసి, తెలంగాణ దోమకొండ ఇంటర్ కాలేజ్ లెక్చరర్ రజిత, నెల్లూరు సుజాత, నారాయణమ్మ, వైజాగ్ శ్రీహరి రాజు, హారిక, మౌళి, తెలంగాణకు చెందిన గురుప్రకాష్, శిరీష, రజిని తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సెమినార్ సమాజంలో అవగాహన పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషించిందని నిర్వాహకులు తెలిపారు.