
తిరుపతి: తిరుపతి నూతన మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన జయకృష్ణను జనసేన పార్టీ రాష్ట్ర జాయినింగ్స్ కమిటీ సభ్యులు ఆరణి మదన్ మోహన్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన జయకృష్ణకు ఆరణి మదన్ మోహన్ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా తిరుపతి నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, సౌకర్యాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి ఆసుపత్రి అభివృద్ధి సంఘం సభ్యులు భూనపల్లి మునస్వామి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు మధుబాబు, జనసేన నాయకులు సునీల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.