వెంకన్న బాబు మృతదేహానికి అమలాపురం ఎంపీ G. M. హరీశ్ బాలయోగి నివాళులు

ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామం:

కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ డైరెక్టర్ నంద్యాల వెంకన్న బాబు మృతిచెందడంతో ఆయన మృతదేహానికి అమలాపురం పార్లమెంట్ సభ్యులు G. M. హరీశ్ బాలయోగి వెంకన్న బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం గ్రామస్తులతో కలిసి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వెంకన్న బాబు అంతిమయాత్రలో పాల్గొన్నారు.

వెంకన్న బాబు మృతి పార్టీకి, గ్రామానికి తీరని లోటని హరీశ్ బాలయోగి పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.