
రాజంపేట: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ టి.సుండుపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జనసేన పార్టీ సీనియర్ నేత రామ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కలిసి ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించాయి. భక్తి శ్రద్ధలతో శివాలయంలో అర్చన కార్యక్రమం చేపట్టి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని పరమేశ్వరునికి ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించి, ప్రజల ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మచ్చా లక్ష్మీనారాయణ, కృష్ణయ్య, శ్రీరాములు, వెంకట సుబ్బరాజు, సిద్దయ్య, ఋషేంద్రబాబు, నాగనిథిన్, శివప్రసాద్, రెడ్డయ్య, నాగరాజ, జయరామ్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.