
మంగళగిరి నియోజకవర్గంలోని స్థానిక సీతానగరం ఆంజనేయ స్వామి దేవాలయంలో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పవన్ కళ్యాణ్ ఇటీవల అస్వస్థతకు గురై శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యం మెరుగుపడి త్వరగా ప్రజా సేవలో తిరిగి పాల్గొనాలని ఆకాంక్షిస్తూ ఈ పూజలు నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా 19వ వార్డు ఉపాధ్యక్షులు వీరిశెట్టి వెంకటేశ్వరరావు, వీరిశెట్టి శివజ్యోతి, ఎం.టి.ఎం.సి ఉపాధ్యక్షుడు సాదు చంద్రశేఖర్, జొన్న రాజేష్, నూతక్కి సురేష్, సమ్మెట గోపి, బండ్రెడ్డి పవన్, దుత్త దినేష్, నక్క రాజేష్, గుర్రాల శేషగిరి, గాజుల సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.