కేరళలో జనసేన విస్తరణకు సమాలోచనలు

• జనసేన పార్టీకి జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతోంది
• శ్రీ పవన్ కళ్యాణ్ భావజాలం భాషలకు, ప్రాంతాలకు అతీతం
• తిరువనంతపురం సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబు, ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్

కేరళలో జనసేన పార్టీని విస్తరించాలన్న స్థానిక నాయకుల అభ్యర్థన, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ గారు కేరళ రాష్ట్రంలో పర్యటించి, కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో జరిగిన సమావేశంలో స్థానిక నాయకులతో చర్చించారు. భవిష్యత్తులో కేరళలో జనసేన పార్టీ బలోపేతం కోసం చేపట్టబోయే అంశాలను, సమాలోచనలను పంచుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ కె. నాగబాబు గారు మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి దశాబ్దకాలం పాటు ప్రజాక్షేత్రంలో పోరాటాలు, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ప్రత్యక్షంగా చేపడుతున్న సేవలు, అభివృద్ధి పనులను అనుసరిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు తమ రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ విధానాలు అవలంబించి, తమ ప్రాంతాల్లో జనసేన పార్టీని విస్తరించుకోవాలని అనుకోవడం శుభ పరిణామమని స్పష్టం చేశారు. ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా జనసేన సిద్ధాంతాలు ఒకే విధంగా ఉంటాయని, రాజకీయంగా స్థానిక అంశాలు, సమస్యలకు అనుగుణంగా పార్టీ విధి, విధానాలు ఉంటాయని అన్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ గారు మాట్లాడుతూ.. శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలం భాషలకు, ప్రాంతాలకు అతీతంగా దేశస్థాయిలో ప్రజలను ఆకట్టుకుంటోందని, దక్షిణ భారతదేశం వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జనసేన పార్టీ విస్తరణ కోసం అభ్యర్థనలు వస్తున్నాయని, అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో పర్యటించి, జనసేన పార్టీ విస్తరణకు అవసరమైన ప్రయత్నాలు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువజన నాయకులు శ్రీ గోకుల రవీందర్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్చార్జ్ డాక్టర్ శ్రీ మాధవరెడ్డి పాల్గొన్నారు.
• కేరళ నుండి జనసేనలో చేరికలు
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో జరిగిన సమావేశం అనంతరం ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబు గారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ గారు సమక్షంలో, స్థానిక నాయకుల నేతృత్వంలో నేషనల్ లేబర్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్, హిందుస్థాన్ అవమీ మోర్చా, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నుండి 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. శ్రీ కె. నాగబాబు గారు, శ్రీ తాళ్లూరి రామ్ గారు పార్టీ కండువాలు కప్పి వారందరినీ జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ కార్యక్రమాల్లో అనుసరించే విధానాలను, సిద్ధాంతాలను కార్యకర్తలకు వివరించారు. కేరళలోని అట్టింగల్ నియోజకవర్గం నుండి శ్రీ కె. డాన్సీలన్, శ్రీ పి. రామ్‌సాగర్, త్రివేండ్రం నియోజకవర్గం నుండి శ్రీ ఎస్.కె. దిలీప్ కుమార్, కాలికట్ నియోజకవర్గం నుండి శ్రీమతి జోషి అథోలి, శ్రీ బిజు కె మావూర్, కొచ్చి నియోజకవర్గం నుండి శ్రీ ఎం.కె. అంబేద్కర్, త్రిశూర్ నియోజకవర్గం నుండి శ్రీ టోమ్ వర్గీస్, శ్రీ కె, బెస్సీ థామస్, శ్రీ మోహన్‌దాస్, శ్రీ ఫణికేర్, మలప్పురం నియోజకవర్గం నుండి శ్రీ ఎం. సునీల్ కుమార్, మహ్మద్ రైసుద్దీన్, శ్రీ కె.ఎం. ఆడమ్ మాలిక్, శ్రీమతి కె. శ్రీజ, వయనాడ్ నియోజకవర్గం నుండి శ్రీ అనిల్ ఎస్ నాయర్, ఎర్నాకులం నియోజకవర్గం నుండి శ్రీ సౌమ్య ఉన్నికృష్ణన్ తదితర ముఖ్య నాయకులు జనసేన పార్టీలో చేరారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.