
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకరిగా పేరుగాంచిన మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును యువ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అధిగమించారు. కెప్టెన్‌గా అత్యధిక విజయాల శాతం నమోదు చేసిన జాబితాలో అయ్యర్ అగ్రస్థానంలో నిలవడం విశేషంగా మారింది.
ఇప్పటివరకు 50కి పైగా మ్యాచ్‌లలో కెప్టెన్సీ వహించిన ఆటగాళ్లలో అయ్యర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఆయన కెప్టెన్‌గా 59.60 శాతం విజయాలు నమోదు చేయగా, ధోనీ విజయ శాతం 57.87గా ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్లను నడిపిస్తూ అయ్యర్ తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారు. కేవలం విజయాలు సాధించడమే కాకుండా, జట్టులోని ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను రాబట్టడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ గణాంకాలు శ్రేయస్ అయ్యర్‌ను ఐపీఎల్‌లో అత్యుత్తమ కెప్టెన్‌లలో ఒకరిగా నిలబెట్టడంతో పాటు, భవిష్యత్‌లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.