బహుదానది ప్రాంతంలో ఇసుక తరలింపుపై ఆందోళన

రాజంపేట: టి. సుండుపల్లి మండలం ఎర్రమనేనిపల్లె వద్ద గతంలో తాత్కాలికంగా ఇచ్చిన ఇసుక తరలింపు అనుమతులను తక్షణమే శాశ్వతంగా రద్దు చేయాలని బహుదానది పరివాహక ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. ఈ అంశంపై జనసేన పార్టీ సీనియర్ నేత రామ శ్రీనివాస్ పలు మార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, యువనేత లోకేష్, జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులకు అర్జీలు సమర్పించారు.

ఈ ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా విజిలెన్స్ అధికారి సుబ్రహ్మణ్యం, మైన్స్ ఏడీసీ వెంకటసుబ్బారెడ్డి సిబ్బందితో కలిసి, టి. సుండుపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్‌కెఎం హుస్సేన్ మరియు పోలీసు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా త్రాగునీరు మరియు సాగునీటి కొరత తీవ్రతను అధికారులు గమనించారు.

ప్రాంత ప్రజలు ఇసుక తరలింపును పూర్తిగా నిలిపివేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ శ్రేణులు, కూటమి నేతలు చప్పిడి మహేష్ నాయుడు, మచ్చా లక్ష్మీనారాయణ, యూసుఫ్, యర్రంరెడ్డి, శ్రీనివాసరాజు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో స్థానికులు హాజరై తమ సమస్యలను అధికారులకు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.