
సర్వేపల్లి నియోజకవర్గంలోని మామిడిపూడిలో జగనన్న కాలనీల పరిస్థితిని జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవాని నాయుడు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీల్లో జరిగిన అభివృద్ధి, నిర్మాణాల స్థితిగతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో పేదలకు ఇళ్లు పేరుతో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అర్హులైన పేదలకు ఇళ్ల సౌకర్యం అందించడంలో విఫలమైందని విమర్శించారు. కొంతమంది నాయకులు అక్రమాలకు పాల్పడి లాభాలు పొందారని అన్నారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తోందని, పేదల సొంత ఇల్లు కలను నెరవేర్చేందుకు దశలవారీగా ఇళ్లను అందిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అర్హులైన వారికి నాణ్యమైన గృహాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
అయితే ఈ చర్యలను సహించలేక కొందరు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చారని, అయినప్పటికీ మార్పు రావడం లేదని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, షేక్ రహీం, బాలా అశోక్, దగ్గోలు సుమన్, వెంకటాచలం మండల కార్యదర్శి సందూరి శ్రీహరి, జమీర్, షాహుల్, రమేష్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.