
నంద్యాలలో జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జనసేన నాయకులు రాచమడుగు చందు మరియు సుందర్ ఆధ్వర్యంలో పెద్దబండ ఆంజనేయస్వామి ఆలయం, అలాగే నంద్యాల చౌడమ్మ ఆలయంలో ఈ పూజా కార్యక్రమాలు చేపట్టారు. తమ అభిమాన నాయకుడు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో రాచమడుగు రాంబాబు, ఠాగూర్, సంజీవ రాయుడు, వరప్రసాద్, చిన్న, శివ శేఖర్, రవి తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.