పిఠాపురంలో జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాగబాబు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. త్వరలోనే ఆయన పిఠాపురానికి వస్తారని వెల్లడించారు.
అదేవిధంగా తాటిపర్తి గ్రామంలో నూతనంగా నిర్మించిన రైస్ మిల్‌ను నాగబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ పర్యటనతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.