ఇంటర్ ఫలితాల్లోమహిళా కళాశాలకు ర్యాంకులు పంట

అమలాపురం ప్రాంతంలోని ముమ్మిడివరం శ్రీకృష్ణ దేవరాయ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. అధిక శాతం మార్కులతో కళాశాలకు ప్రథమ స్థానాన్ని సాధించారు.

ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూప్‌లో గవరతల్లి మౌనిక 440/470 మార్కులు సాధించారు. బైపీసీ గ్రూప్‌లో పంపన పద్మప్రియ 425/455 మార్కులు, షేక్ అదియా 423/500 మార్కులు సాధించారు. సీఈసీ గ్రూప్‌లో కూడా విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించి ప్రథమ స్థానాల్లో నిలిచారు.

ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో సకిలే శశికళ (బైపీసీ) 949/1000 మార్కులు, కొప్పిశెట్టి పద్మావతి (ఎంపీసీ) 944/1000 మార్కులు, సుధా భాగ్యశ్రీ 936/1000 మార్కులు, ఇసుకపూడి నాగజ్యోతి (సీఈసీ) 919/1000 మార్కులు సాధించారు.

ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 80 శాతం, ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 70 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ప్రిన్సిపాల్ గంధం శ్రీ రామమూర్తి తెలిపారు. ఈ ఫలితాలు కళాశాల విద్యా ప్రమాణాలను ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.