పవన్ కళ్యాణ్ ఆరోగ్యంకోసం మృత్యుంజయ హోమం

  1. మా అధ్యక్షుడి ఆరోగ్యమే మాకు మహా భాగ్యం.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, తాతంశెట్టి నాగేంద్ర

రైల్వే కోడూరు: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల ఆరోగ్య సమస్యల నుండి త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ రైల్వే కోడూరు భుజంగేశ్వర ఆలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఐదు మండలాల జనసేన పార్టీ శ్రేణులు ఒకే సంకల్పంతో హోమ క్రతువులో పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన యాగం భక్తి శ్రద్ధలతో కొనసాగింది.

ప్రధాన అర్చకులు యోగిస్వామి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పేరు, గోత్రం, రాశి, నక్షత్రం ఆధారంగా ప్రత్యేక సంకల్పం చేయబడింది. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని వేద మంత్రోచ్చారణలతో ప్రార్థనలు నిర్వహించారు.

హోమం అనంతరం పాల్గొన్న భక్తులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాతంశెట్టి దంపతులు, మార్కెట్ కమిటీ చైర్మన్ వరలక్ష్మి, పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.