
కొవ్వూరు నియోజకవర్గ కేంద్రంలో డ్వాక్రా మహిళలకు (వి.ఓ.ఏ) మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు లబ్ధిదారులకు మొబైల్ ఫోన్లు అందజేశారు.
ఈ సందర్భంగా పి.ఏ.సి.ఎస్ ఛైర్మన్ మరియు జనసేన పార్టీ కొవ్వూరు మండల అధ్యక్షుడు సుంకర సత్తిబాబు మాట్లాడుతూ, మహిళలు డిజిటల్ రంగంలో ముందుకు రావడానికి, తమ బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ మొబైల్ ఫోన్లు ఉపయోగపడతాయని తెలిపారు. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.