
అమలాపురం: సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్‌గా జి ఎన్ రావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా సంస్థ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివనాగేశ్వరరావు చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని స్వీకరించారు.
తన నియామకానికి సహకరించిన రాష్ట్ర మరియు జిల్లా కమిటీ సభ్యులకు జి ఎన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ విధానాలు, నియమ నిబంధనలు పాటిస్తూ హిందూ సమాజ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.