మదనపల్లి నియోజకవర్గంలో కూటమి సమన్వయ సమావేశం

మదనపల్లి: జనసేన పార్టీ మదనపల్లి నియోజకవర్గ నాయకులు శ్రీరామ రామాంజనేయులుని రాష్ట్ర ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు నాగూర్ వలీ (షో ఆఫ్ శీను), రాష్ట్ర టిడిపి మైనార్టీ సెల్ కార్యదర్శి నిమ్మనపల్లి సాజిద్ జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలో కూటమి పార్టీలు మరింత బలోపేతం కావడానికి పరస్పర సమన్వయం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో కూటమి నాయకులు సమిష్టిగా ముందుకు సాగాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో పరస్పర గౌరవం సూచకంగా ఘనంగా సన్మానం చేసుకున్నారు. కార్యక్రమంలో కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన, తెలుగుదేశం, బిజెపి నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.