
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి, ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) పిడుగు హరిప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త, శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలు తంబళ్ళపల్లి రమాదేవి మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పిడుగు హరిప్రసాద్‌తో కేక్ కట్ చేయించి, ఆయనకు ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న సేవలు మరింత విస్తరించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నందిగామ పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ కొట్టె హరికృష్ణ (బద్రి), కొమ్మినీడి సత్యనారాయణ, బోయిన శ్రీనివాస్, గోపి శంకర్, నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకుడు పాశం నాగబాబు, ఇతర జనసేన పార్టీ నాయకులు పాల్గొని పిడుగు హరిప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పిడుగు హరిప్రసాద్ ప్రజా సేవా దృక్పథాన్ని కొనియాడుతూ ఆయన మరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.